నర్సాపూర్ జనవరి 27 (సిరి న్యూస్) : నర్సాపూర్ పురపాలక సంఘం పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశం పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మరియు నర్సాపూర్ శాసన సభ్యురాలు గౌరవనీయులు వాకిటి సునితా లక్ష్మారెడ్డి హాజరు అయినారు వారు మాట్లాడుతూ సమాజంలో పదవులు ముఖ్యం కాదని వారు చేసిన మంచి పనులే భవిష్యత్తు రాజకీయాలకు నాంది అవుతుంది అన్నారు.
ఎంపీ కోట కింద 12 కోట్లతో నర్సాపూర్ ను అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని రఘునందన్ రావు అన్నారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయించాలని ఎమ్మెల్యేకు ఎంపీకి విద్యార్థులు వినతిపత్రం అందించారు .మున్సిపల్ మాజీ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణ ప్రజల ఆశీస్సులు మరియు కౌన్సిలర్ ల సహకారంతో ఈ కొద్దిపాటి కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, నిధుల కొరత వలన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్న సమయం లేనందున చేయలేకపోయము.
నాకు చైర్మన్ గా అవకాశం కల్పించిన గౌరవ శాసన సభ్యురాలు సునితా లక్ష్మారెడ్డి కి కౌన్సిల్ సభ్యులకు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు అన్నారు ఐదు సంవత్సరాలు కాలంలో మున్సిపల్ సిబ్బందితో గల అనుబంధాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా తన వంతుగా పట్టణ అభివృద్ధిలో తప్పకుండా సహకరిస్తానని తెలియజేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు కౌన్సిల్ సభ్యులను శాలువాలు మరియు మెమొంటోలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.