గాంధీజీ చిత్రపటానికి వినతిపత్రం

చిలిపిచేడ్ జనవరి 30 (సిరి న్యూస్) : మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు తదనంతరం కాంగ్రెస్ పాలనపై గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కానీ 425 రోజులు గడుస్తున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరు గ్యారెంటీలని ప్రజా పాలన వ్యవస్థ మాది అని చెప్పుకుంటూ ప్రజలను నట్టేట్లో ముంచేస్తున్నారని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అవి అమలు చేసే దిశగా వారికి చిత్తశుద్ధిని కల్పించాలని గాంధీని వేడుకున్నారు. అదేవిధంగా మంగళవారం నాడు మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుమితా లక్ష్మారెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తన స్థాయిని తెలుసుకొని ప్రవర్తించాలని పార్టీలపరంగా గెలుపోవటములైన విషయాలను మాట్లాడితే ఎమ్మెల్యే సునీత రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిందని మోసపూరిత చర్యల్లో ముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలుసుకోవాలని అన్నారు.

తను రాజకీయవేత్త అయితే రాజకీయపరంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలను మాట్లాడడం సరికాదని తెలియజేశారు పార్టీలు మారే విషయంపై మొదట తను వెంట ఉన్న వారంతా ఏ ఏ పార్టీల నుండి వచ్చారు గమనించుకోవాలని హెచ్చరించారు మరో మారు ఆ సందర్భ ప్రేలాపంతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని గాని బిఆర్ఎస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి ఉపాధ్యక్షుడు బేస్త లక్ష్మణ్ వీరస్వామి రాజిరెడ్డి మాజీ సర్పంచులు యాదగిరి గోపాల్ రెడ్డి లక్ష్మణ్ సీనియర్ నాయకులు షఫీ యువజన నాయకులు గంగాధర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.