వెల్దుర్తి : లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా..వినతి పత్రం.
రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు వంచ భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెన్నవరం మోహన్ రెడ్డి, కోదండ కృష్ణ గౌడ్ గన్నవరం, శ్రీనివాస్ రెడ్డి బాల్రెడ్డి నరసింహారెడ్డి రమేష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.