ఏమైనా ఆస్పత్రిలో సమస్యలుంటే చెప్పండి..
వైద్య ఆరోగ్య శాఖమంత్రి దృష్టికి తీసుకెళ్తా..
“ఖేడ్” ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్‌లో శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి..
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో సోమవారం ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కార్యక్రమంలో శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్‌లో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మనకు ఏ అవసరం ఉన్న మన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మనకు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అని ఎమ్మెల్యే అన్నారు.
హాస్పిటల్ లో వైద్యులు ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఎట్టి పరిస్థితుల్లో అయిన ఈ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యసేవలు అందించాలని ఒకవేళ ఇక్కడ కానీ యెడల వేరే హాస్పిటల్లో గాని ప్రైవేట్ హాస్పిటల్ లో గాని రిఫర్ చేయాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హాస్పిటల్ వైద్య సిబ్బందిలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు నారాయణఖేడ్ ఆర్డిఓ అశోక్ చక్రవర్తి, హాస్పిటల్ సుపరిండెంట్ రమేష్ , మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్,మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్ జీవన్,వివేకానంద కౌన్సిలర్, తహేర్ మండల అధ్యక్షులు, పండరి రెడ్డి ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీలు,శంకర్ ముదిరాజ్,వెంకట్ రావు,జ్ఞనోభారావు పాటిల్, దిల్ దర్ ఖాన్ సాబ్,అమృత్,అర్జున్ మాజీ ఎంపీటీసీ,నర్సింలు, హాస్పిటల్ వైద్య సిబ్బందీ తదితరులు పాల్గొన్నారు.