విద్యార్థుల సర్టిఫికెట్లకు సతాయింపు రెవెన్యూ అధికారులు.

నారాయణఖేడ్‌: జనవరి 27 (సిరి న్యూస్) విద్యార్థుల కుల, ఆధాయ, స్థానిక ధ్రువపత్రాల జారీలో “ఖేడ్‌” రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మీసేవలో సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌ చేసిన తహశీల్‌ కార్యాలయంలో సంప్రదిస్తే దురుసుగా సమాధానం ఇస్తూ తిప్పించుకుంటున్నారని వాపోయారు. పాఠశాలలు, కళాశాలల్లో స్కాలర్‌షిప్స్‌ ఇతరత్రా అవసరాలకు సమర్పించాల్సి ఉందని తెలిపారు.

విద్యార్థులమైన తాము పాఠశాల సమయాలను కొల్పోయి కార్యాలయం చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నామని, ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే రెవెన్యూ కార్యాలయం ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుమార్‌ హెచ్చరించారు. త్వరలో కల్టెర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆపరేటర్‌తో వాగ్వాదానికి దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు.