అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జగన్ డిమాండ్..
సంగారెడ్డి : రామచంద్రపురం మండలం వెలుమల గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సి కుటుంబాలకు గతంలో 434 సర్వే నంబర్ భూమిని కేటాయించి పట్టా సర్టిఫికెట్,పాసుబుక్కులు ఇచ్చినారు. ఇట్టి భూములు వాళ్ళు సాగు చేసుకున్న సందర్భంలో కొండకల్ మరియు వెలిమల గ్రామాల శివారులోని సర్వే నంబర్ల పంచాయతీ ఉన్నందున సర్వే చేసి సరిచేసి ఎవరి భూములు వాళ్లకు చూపిస్తామని గతంలో రెవెన్యూ అధికారులు తెలపడం జరిగింది.
ఇట్టి సమస్య ఈ మధ్యలో పరిష్కరించిన తర్వాత కొందరికి పొజిషన్ పట్టా పాసు బుక్కులు, ఇవ్వడం జరిగింది,ఇంకొందరికి ఇవ్వకపోవడంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ ను తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ మరియు డీవీఎంసీ మెంబర్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పంబాల దుర్గాప్రసాద్ రైతులతో కలిసి సమస్యను పరిష్కరించి నిరుపేద ఎస్సీ రైతులను న్యాయం చేయాల్సిందిగా కోరగా సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ గారికి సర్వే చేసి వారికి భూములు చూపించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కట్టల సదానందం, జెల్ల సురేష్, సలీం,కృష్ణ బిఎస్పి నాయకులు మోహన్, రైతులు రాములు, చంద్రయ్య,రాజు