నారాయణఖేడ్ : నాగల్ గిద్ధ మండలంలోని ఇరాక్ పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించి, పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే డా, పట్లోళ్ల సంజీవ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేనిది ఒక సంవత్సర కాలంలోనే చేసి చూపించామని అన్నారు.
ఇరాక్ పల్లి గ్రామంలో చాలా నీటి సమస్య ఉంది మీ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని మీ దాహార్తిని తీరుస్తానని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి చిప్ప చేతికిచ్చిన, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ 50వేల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని,
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని,ఇంకా కొంత మందికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వలన కొంతమందికి ఇవ్వలేకపోయామన వారిని కూడా గుర్తించి తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు అద్వనoగా అయ్యారయ్యాయని ఏ ఒక్క గ్రామానికి కూడా రోడ్లు సరిగ్గా వేయలేదు అన్నారు. గ్రామాలలో మరియు తండలలో తగడానికి నీరు కూడా అందించలేదు. గత ప్రభుత్వం ఎక్కడ కూడా విద్య మరియు వైద్య రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని గత ప్రభుత్వం, మళ్ళీ బిఆర్ఎస్ నాయకులు నా పైన కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కానీ మేము వారిలాగా కాకుండా విమర్శలు ప్రతి విమర్శలకు పోకుండా కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి DCC ప్రధాన కార్యదర్శి మండల ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, మరియు ఇరాక్ పల్లి గ్రామ ప్రజలు పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.