ఫీజులు గుంజుతున్న వసతులు కరువు
అర్హత లేని ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ
ఝరాసంగం ఫిబ్రవరి 6 సిరి న్యూస్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అల్లిపూర్ లోని కృష్ణవేణి పాఠశాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా గురువారం పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు, పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని పదవ తరగతి విద్యార్థులకు అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులకు కనీసం తెలుగు ఇంగ్లీష్ కూడా చదవడానికి రావట్లేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపణలు చేసారు, పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా యజమాన్యం స్పందించకుండా పట్టించుకోవట్లేదు ఫీజులు మాత్రం సమయానికి వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆయన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.