అందోల్ : ఈరోజు అందోల్ లో రంగనాథ స్వామి కళ్యాణోత్సవానికి పద్మిని దామోదర్ రాజనర్సింహ హాజరై స్వామివారికి పువ్వుల హారాలు అర్పించారు, ఆమెతోపాటు శేరి సునీత జగన్మోహన్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. పిల్లలతో భారత నాట్యాలతో గుడిలో చేశారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శామ్ నాథ్ శర్మ అన్నారు. గ్రామంలో ఉన్న మాజీ కౌన్సిలర్ రాచకొండ ప్రదీప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ తోట్ల రామకృష్ణ, ప్రస్తుత కౌన్సిలర్ తిరుమల హరికృష్ణ గౌడ్, ప్రస్తుత కౌన్సిలర్ చిట్టిబాబు, ఆమె వెంట్ట ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రంగనాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.