పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం..

Padmasali Sangam New Calendar Inauguration Festival..
Padmasali Sangam New Calendar Inauguration Festival..

సంగారెడ్డి : ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ , పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులను పద్మశాలి సంఘం నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ..పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీలో ఒకడిగా మీతో ఉంటూ పరిష్కారానికి చేస్తా. జిల్లా పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి నా పూర్తి మద్దతు ఉంటుంది.

నా గెలుపులో కృషిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.దేశంలో ప్రత్యేకమైన, గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలీకే ఉంది. ఐక్యమత్యంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నా వంతుగా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు గందిమల్లె రాజు, రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సీత వైద్యం కిషోర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, పద్మశాలి సంఘం అసోసియేట్ అధ్యక్షులు గడ్డం జనార్ధన్, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు నర్సింలు, జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి నారాయణ, పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.