మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం

Pabba Mahesh Gupta visited many families and provided financial assistance
Pabba Mahesh Gupta visited many families and provided financial assistance

  మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!

శివంపేట్ : శివంపేట్ మండల కేంద్రంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పిట్ట నాగరాజు ప్రమాదవశాస్తు యాక్సిడెంట్ కావడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 10000, అనంతరం ఇదే గ్రామానికి చెందిన కమ్మరి దుర్గాప్రసాద్ ప్రమాదవశాస్తు యాక్సిడెంట్ లో మృతి చెందిన ఆ కుటుంబాన్ని పరామర్శించినా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 10000.పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన పంబండ అగమయ్య ముదిరాజ్,గత కొన్ని రోజులుగా గుండె నొప్పితో బాధపడుతూ మృతి చెందిన పరామర్శించి 5000 ఆర్థిక సాయం, నిత్యవసర సరుకులు శివంపేట్ తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అందజేశారు.

మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సహాయం..

చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన గుత్తి నర్సింలు జీవనోపాధికై చెన్నైకి వలస వెళ్లి కూలి పని చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవ శక్తులు రైలులో నుండి కిందపడి తీవ్ర గాయాలతో బాధపడుతున్న నర్సింలుకు చికిత్స నిమిత్తం 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, పాపయ్య చారి యాదగిరిరావు శంకర్ గౌడ్, కిషన్ నాయక్ సాదు రాములు, పిట్ల శ్రీనివాస్ ,పిట్ల కుమార్, చింతకాయల యాదయ్య , గోపాల్ , సాదు ,శీను, అభిలాష్, దుబ్బ రాములు, మరియు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.