నారాయణఖేడ్: ఫిబ్రవరి 5 (సీరి న్యూస్) కంగ్టి మండలం వడగమాలో రాత్రి పత్తి మిల్లు యజమానితో మాట్లాడడానికి వెళ్లిన నాగూర్ బి గ్రామానికి చెందిన రైతు ఉమాకాంత్,పై కాటన్ మిల్లు యాజమాని మేనల్లుడు నిలేష్, రైతుపై అకారణంగా దాడి చేయగా రైతు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అదే రాత్రి పత్తి మిల్లు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పత్తి మిల్లు యజమానితో రైతులకు క్షమాపణ చెప్పించారు. దాంతో రైతులు ఆందోళన విరమించారు. గాయాలైన ఉమాకాంతుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.