-ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి.
-ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి.
– బి ఆర్ఎస్ హయాంలోనే మోతిమాతా ఆలయ అభివృద్ధి.
– మోతీమాతాను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు.
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల పరిధిలోని ఉప్పరపల్లి తండాలో మరిగమ్మ మోతీమాతా జాతర వేడుకల్లో సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మోతిమాత జాతర నిర్వాహకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కెషు సింగ్ రాథోడ్, అధ్యక్షులు కిషన్ పవార్,అసోసియేట్ అధ్యక్షులు శంకర్ నాయక్ లు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సంధర్బంగా మాజి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ….. మోతీమాత జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ, సంగారెడ్డి జిల్లాతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు మోతీమాతా జాతరలో పాల్గొనేందుకు వస్తుంటారాన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం జరగాలని రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాoడాలను గ్రామపంచాయతీలుగా చేసి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, తాగునీటి వసతి, రహదారి, విద్యుత్ సౌకర్యలు కల్పించామన్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ తో విద్య ఉద్యోగాలలో గిరిజనులకు అవకాశం ఇచ్చారనీ గుర్తుచేశారు. గిరిజన విద్యార్థులు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందనీ, వెంటనే స్కాలర్షిప్ను విడుదల చేయాలాన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీను అమలు చేయలేదనీ అన్నారు. మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా అమలు చేయలేదు. గిరిజనులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
మోతిమాత జాతరకు వెళుతున్న మాజీ మంత్రి హరీష్ రావుతో రైతు భరోసా, రుణమాఫీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని తమ గోడును చెప్పుకున్న గోవింద్ పూర్ గ్రామ రైతులు. మంత్రి వెంట జహీరాబాద్ శాసనసభ్యులుమాణిక్ రావు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి, మాజి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం , మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప ,రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్లా,మాజీ పట్టణ అధ్యక్షులు యాకూబ్,మోహిఉద్దిన్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సురేష్, రవికిరణ్ ,జగన్,నియోజకవర్గ ఎస్సీ,ఎస్టీ ,బీసీ అధ్యక్షులు ,అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.