– 10 తేదీ నుండి 12 తేదీ వరకు
– భారీ నగదు బహుమతి
*గుమ్మడిదల జనవరి 9
(సిరి న్యూస్)*
గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను గుర్తించాలని ఓపెన్ టు ఆల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన గుమ్మడిదలలో ఈనెల 10వ తేదీ నుంచి ఓపెన్ టు ఆల్ వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతి అందజేస్తున్నారు. రాష్ట్రంలో నుండి ఎవరైనా సరే ప్రతిభ గలవారు వాలీబాల్ ,కబడ్డీ పోటీలలో పాల్గొనవచ్చునని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి టోర్నమెంట్ కు వచ్చిన క్రీడాకారులకు భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు వాలీబాల్ మొదటి బహుమతి 50 వేలు రెండవ బహుమతి 30 వేలు మూడో బహుమతి 15 వేలు కబడ్డీబహుమతి 50 వేలు రెండవ బహుమతి 30 వేలు మూడో బహుమతి 15 వేలు ప్రతిభను ప్రదర్శించి నగదును పొందవచ్చునని తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి:ఓపెన్ టు ఆల్ వాలీబాల్, కబడ్డీ గవర్నమెంట్ కు గుమ్మడిదల ప్రాథమిక పాఠశాల క్రీడ మైదానం సిద్ధమైనది. పోటీలకు రాత్రి సమయమైతే హెడ్లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.