ఆన్లైన్ మోసాలు..సీజీఎమ్ పేరిట నకిలీ వస్తువుల అమ్మకాలు

మధుమేహ వ్యాధిగ్రాస్తులే వారి టార్గెట్

మెదక్ ప్రతినిధి, ఫిబ్రవరి 01, (సిరి న్యూస్) : ప్రజల అనారోగ్యమే టార్గెట్గా చేసుకొని కొన్ని ఆన్లైన్ సంస్థలు మోసలకు పాల్పడుతున్నాయి. ముక్యంగా మేడమేహం వ్యాధి గ్రాస్తులను టార్గెట్ చేసి, వారికి ఆరు నెలల్లో రోగం పూర్తిగా నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసి అబద్దపు ప్రచారాలతో నమ్మబలిసి వారి నుండి దాదాపు ఇరవై వేల వరకు ముందుగా వసూల్ చేసి వారికి సీజీఎమ్, మానిటర్ లను పంపుతామని మేడమేహ వ్యాధి గ్రాస్థులకు ఎర వేసి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకొని మోసలకు పాల్పడుతున్నారని చాలా మంది బాధితులు వాపోతున్నారు. ఈలాంటి మోసపూరిత ఆన్లైన్ మోసగాళ్ళను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎప్పటికప్పుడు రోగుల ఆశ ఈ మోసగాళ్ల ఆగడాలకు ఆపలేకపోతుంది. మొన్నటికి మొన్న మెదక్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నిండి ఆఫర్ పేరిట దాదాపు 20వేలు కట్టించుకొని డూప్లికేట్ సీజీఎమ్, మానిటర్ పంపి మోసం చేసిన ఘటన బయటకు వచ్చింది…ఇంకా చాలా మంది బాధితులు వీళ్ళ మోసలకు బలైయ్యారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు పిర్యాదు చేసి వినియోగ దారులు ఫోరమ్ లో పిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.