జాతరకు ముస్తాబైన ఎడ్లబండ్లు..
న్యాల్కల్ : మండల పరిధిలోని వడ్డీ గ్రామంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 25వ పాత పంటల జాతరను ప్రారంభిస్తున్నట్లు జాతర కోఆర్డినేటర్లు తెలిపారు. పాత పంటల జాతర ఉత్సవాలు వచ్చేనెల 11వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని 23 గ్రామాలలో ఎడ్ల బండ్ల ఊరేగింపు కోలాటం మహిళా సంఘాల ఆటపాటలతో పాత పంటల విశిష్టతను సంప్రదాయ వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతర ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. జాతర ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక నాయకులతోపాటు ప్రముఖులు వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు.