సంగారెడ్డి : ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోనిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధప్రాంతాల నుండి ప్రజలు 63 దరఖాస్తులను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు మళ్లీ మళ్లీ వస్తున్నాయని అలా రాకుండా అధికారులు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు ఆయా శాఖల వారీగా పంపించనున్నట్లు తెలిపారు . వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో రెవెన్యూ శాఖ 28, పౌర సరఫరాల శాఖ 3, మార్క్ ఫెడ్ 1, సర్వే ల్యాండ్ రికార్డ్ 6, పంచాయితీ & పి టి విభాగం 2, పంచాయతీరాజ్ 4, డి.ఆర్.డి ఓ 4, పీ.డి మెప్మా 1, మున్సిపల్ విభాగం 3, మొత్తం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, విద్యాశాఖ 1, పశువు వైద్య శాఖ 1, వైద్య & ఆరోగ్యశాఖ 1, పోలీస్ శాఖ 1, రవాణా శాఖ & రెగ్యులేటరీ శాఖలు 2, మొత్తం 63 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ , మాధురి, డి ఆర్ ఓ, పద్మజ రాణి, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.