శివంపేట్ జనవరి 25(సిరి న్యూస్ ) : శివంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులచే మండల వివిధ శాఖల అధికారులు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మండల అధికారులు విద్యార్థులచే ఓటర్లు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా శివంపేట మండల ఎమ్మార్వో కమలాద్రి చారి మాట్లాడుతూ నేటితరం యువతకు ఓటు యొక్క విలువ ఎలక్షన్ల ప్రక్రియ గురించి వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు అమలు చేసుకోవాలి. నూతన ఓటరు అప్లికేషన్ కొరకు ఫారం- 6 అడ్రస్ తారుమారు కొరకు పారం- 8 ఇతరాత్రా ఓటరు అప్లై ప్రక్రియ చేసుకునే విధానాన్ని యువతి యువకులకు తెలియజేశారు. అనంతరం శివంపేట మండల ఎస్సై మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలని, మంచివారిని ఎన్నుకునే అవకాశం మన చేతిలోనే ఉన్నదని అదే ఓటు హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కమలాద్రి చారి, డిప్యూటీ తాసిల్దార్ షఫీ, శివంపేట మండల ఎస్సై మధుకర్ రెడ్డి, విద్యాధికారి బుచ్చానాయక్, ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.