చిలప్ చెడ్: విద్యార్థులకు నాణ్యమైన భోజనo అందించాలని చిలప్ చెడ్ తహశీల్దార్ ముసాదిక్ అన్నారు. గురువారం చిట్కుల్ కస్తూర్బా బాలికల పాఠశాలను మధ్యాహ్న భోజనం వంట గది పరిసరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ముసాదిక్ మాట్లాడుతూ.. ప్రతిరోజు మెనూ ప్రకారం వంట చేసి పెట్టాలని, వంట గదితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహాసిల్దార్ సింధుజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.