మల్కాపూర్ గ్రామంలో గ్రామ సభను ప్రారంభించిన నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, జనవరి 21 ( సిరి న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాల అమలులో భాగంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి గ్రామసభల ముఖ్య లక్షమని పేర్కొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ మన్మోహన్ సింగ్, సిరిసి చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మాజీ సర్పంచ్ భాగ్యవతి మంగారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జోగన్న గారి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కుమార్, గ్రామ అధ్యక్షుడు నిరూడి ఆంజనేయులు మరో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మల్కాపూర్ గ్రామసభ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు- 510 రైతు భరోసా రిజెక్ట్ అయినవి, 2007, కొత్త రేషన్ కార్డ్స్ 120 , రైతు ఆత్మీయ భరోసా 26 .మంగ‌ళ‌వారం కొత్తగా వచ్చిన దరఖాస్తులు కొత్త రేషన్ కార్డ్స్ 280, రైతు ఆత్మీయ భరోసా 30 ఇందిరమ్మ ఇల్లు 91 దర్యాప్తులు అందాయని సెక్రటరీ మన్మోహన్ సింగ్ తెలియజేశారు.