అర్హులందరికీ కొత్త పథకాలు అందిస్తాం..

New schemes will be provided to all eligible.

మండల స్పెషల్ ఆఫీసర్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ పి,డి హైమావతి

చేగుంట : అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే 4 కొత్త పథకాలను నేడు చేగుంట మండల పరిదిలోని జైత్రం తండాలో మండల స్పెషల్ ఆఫీసర్ హైమామతి (ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ పి, డి ), మండల తాసిల్దార్ , ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రారంభించారు,మండల స్పెషల్ ఆఫీసర్ హైమావతి మాట్లాడుతూ.. తండాలో రైతు భరోసా, 100%మంది కి ఇందిరమ్మ ఇండ్లు107, మందికి,ఆత్మీయ భరోసా03 కి , కొత్త రేషన్ కార్డులు 81,మంది కి గ్రామంలో పథకాల లబ్ధిదారులు ఎంపికయ్యారని ఆమె ఈ కార్యక్రమ నికి ముఖ్యఅతిథిగా హాజరయి పథకాలను ఆవిష్కరించి, లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీ లను అందజేశారు.

ఈ సందర్భంగా తాసిల్దార్,సత్యనారాయణ, ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఇలా 100% ఇవ్వడం సంతోషకరమైన విషయం అని అన్నారు,
ఈ కార్యక్రమం లో తాసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో చిన్నారెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ హరి ప్రసాద్, ఏపీవో, శ్వేత, ఏ ఈ ఓ కళ్యాణి, ఎంపీ ఓ, సొసైటీ చైర్మన్ మేకల పరమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీ లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.