నారాయణఖేడ్ : స్వామి వివేకానంద స్పూర్తితో జనవరి 12 ఆదివారం ఆయన జయంతి సందర్భంగా నారాయణ ఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వ్యవస్థాపకులు ముజాహెద్ చిస్తీ ఒక ప్రకటనలో తెలిపారు. “ఖేడ్” నియోజకవర్గ గ్రామాల యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. శిబిరం పల్లవి మోడల్ స్కూల్ ,పాత భారత్ గ్యాస్ గోదాం ప్రక్కన కరస్ గుత్తి రోడ్, నారాయణఖేడ్‌లో(Narayankhed) ఉదయం 10గం.లకు నిర్వహించబడుతుందన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్లు 7989894520,6305043932,9494606674కు సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమంలో ఓంప్రకాష్, నర్సిములు, బంగార్రాజు, సంతోష్ రావు పాటిల్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.