రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

Municipal Commissioner inspected the new formation road works
Municipal Commissioner inspected the new formation road works

నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణానికి రింగురోడుగా భావిస్తున్న చంద్ ఖాన్ పల్లి, చౌరస్తా హనుమరెడ్డి మహారాజ్ సమాధి నుండి రాజన్న దాబా కంగిటి రోడ్డును కలిపే బైపాస్ నూతన ఫార్మేషన్ రోడ్డును నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.. నేడు ఆ రోడ్డు నూతన ఫార్మేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించారు. వీరితో పాటు నారాయణఖేడ్ కు చెందిన మాజీ ఎంపీటీసీలు పండరి రెడ్డి, రామకృష్ణలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు శంకర్ నాయక్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పరిశీలించారు.