జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీలు…

Muggula competitions in junior college...
Muggula competitions in junior college...

రామాయంపేట : రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థినిలు పలు రకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, హిమజ్యోతి విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభాను ముగ్గుల రూపంలో బయటకు తీయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకురాలు శ్రీదేవి ఉన్నారు.