ముదిరాజుల మహాసభ విజయవంతం చేయాలి..

Mudirajula Mahasabha should be successful..
Mudirajula Mahasabha should be successful..

హత్నూర : ఈ నెల 5న నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లో జరిగే ముదిరాజుల మహాసభను విజయవంతం చేయాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు కోరారు. గురువారం హత్నూర మండలం బోరపట్ల లో ఏర్పాటు చేసిన ముదిరాజు ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్ నారాయణ మాట్లాడుతూ.. ముదిరాజులు ఏకతాటిపై నిలబడి హక్కుల కోసం పోరాడాలని తెలిపారు.

అదేవిధంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లో చేర్చే వరకు ఐక్యమత్యంతో పోరాడాలన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం లోని సాయి కృష్ణ గార్డెన్లో ఈనెల 5న నిర్వహించ తలపెట్టిన ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు ఆంజనేయులు, కృష్ణ, సంతోష్, రాజేందర్, ఆ గమయ్య, నరేందర,రవికుమార్, కిష్టయ్య తదితరులు ఉన్నారు.