సర్వేశ్వర అంబిక శివాచార్య స్వామి..
పెద్దశంకరంపేట : ముదిరాజ్‌లు ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు పోరాటం చేయాలని దుద్యాల ఆశ్రమ పీఠాధిపతి సర్వేశ్వర అంబిక శివాచార్య స్వామి అన్నారు. సోమవారం స్థానిక మానిక్ ప్రభు దేవాలయంలో ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల క్రిష్ణతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించిన జోడు నిహారికను, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన శ్రీనివాస్, నాగలక్ష్మి, మానస లను వారు సన్మానించారు. కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పున్నయ్య, రవీందర్, సాయిలు. రమేష్, రాములు, శంకరయ్య, అశోక్, బాగయ్య, మానిక్యం తదితరులున్నారు.