ఫిబ్రవరి 2 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి :
బడ్జెట్ లో తెలంగాణ కు కొత్త రైల్వే ప్రాజెక్టు లు, లైన్ లు లేక పోవడం పై ఎ పి లు ఆలోచన చేయాలనీ అన్నారు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్ లో తెలంగాణ కు కొత్త రైల్వే ప్రాజెక్టు లు, లైన్ లు లేకపోవడం, అదే విదంగా పటాన్చెరు నుండి సంగారెడ్డి మీదుగా మెదక్ వరకు రెండు దశబ్ద ల కు పైగా ఇక్కడి ప్రజలు చేస్తున్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించు కోకపోవడం మరో సారి ఈ బడ్జెట్ లో తెలంగాణ కు ముఖ్యంగా సంగారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలకు నిరాశ మిగిల్చిందని, ఇప్పటి కైనా తెలంగాణ కు చెందిన ఎంపీ లు పార్టీ లకు అతీతంగా కేంద్రం నుండి రైల్వే, ఇతర ప్రాజెక్టు ల అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు వచ్చేలా దీర్ఘ ఖాలిక పోరాటం పార్టీలకు అతీతంగా చేయాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ ల సాధనకు, ఆర్ ఆర్ ఆర్ తో పాటు నిమ్జ్ లాంటి ప్రాజెక్టు లు తొందరగా పూర్తి చేయడానికి కేంద్రం నుండి నిధులు రాబట్టెందుకు రాష్ట ప్రభుత్వం అన్ని పార్టీల ఎం పి ల తో కలసి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చేలా కృషి చేయాలన్నారు.