ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే..
నారాయణఖేడ్: కంగ్టీ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభల్లో శుక్రవారం పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇందిరా మాత్మీయ భరోసా రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి పథకాలను తెచ్చి పేదలకు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
గత పది సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఎక్కడో కొంత మంది రైతులకు కొన్ని కొన్ని చిన్న టెక్నికల్ సమస్యల వలన గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వనందుకు గాను రుణమాఫీ జరగలేదని అప్పుడు అర్హులైన రైతులను గుర్తించి వారికి కూడా రుణమాఫీ అయ్యేవిధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల MRO, ఎంపిడిఓ, అధికారులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.