మనోహరాబాద్, జనవరి 22. సిరి న్యూస్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాల్ల కల్ గ్రామ శివారులో ఉన్న దక్షిణేశ్వర్ కేదారినాథ్ ఆలయాన్ని బుధవారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించి స్వామివారికి ఘనంగా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు, కాళ్లకల్ తాజా మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా బిజెపి నాయకుడు జగన్ గౌడ్ తదితరులు ఎంపీకి ఘన స్వాగతం పలికి సన్మానించారు.