ఎమ్మార్పీఎస్ గజ్వేల్ పట్టణ నూతన కమిటీ ఎన్నిక

గజ్వేల్ జనవరి 20 (సిరి న్యూస్): ఎస్సీ వర్గీకరణ అమలు కోసం గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఫిబ్రవరి 07 న హైద్రాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సోమవారం రోజు గజ్వేల్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక సమావేశం గజ్వేల్ మండల ఉపాధ్యక్షుడు సంగపురం రవి మాదిగ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముం డ్రాతి కృష్ణ మాదిగ, జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు, అసెంబ్లీ కన్వీనర్ శనిగారి రమేష్ మాదిగ తదితరులు పాల్గొని గజ్వేల్ పట్టణానికి సంబంధించిన నూతన ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన విజయవంతం చేయడానికి ఈ నెల 25 న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే సన్నాహక సమావేశం సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొననున్నారని వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గజ్వేల్ మండల అధ్యక్షుడు నత్తి నరేష్ మాదిగ,కుల పెద్దలు సంఘపురం ఎల్లయ్య,దయ్యాల యాదగిరి యువకులు విద్యార్థులు పెద్దలు పాల్గొన్నారు.