నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డినీ అరెస్ట్ చేసిన పోలీసులు..
గుమ్మడల రూరల్ : డంపు యాడ్ నిర్మాణం చేపట్టడంతో నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేస్తున్న నల్లవల్లి గ్రామస్తులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డిని అరెస్టు చేశారు. బుధవారం గుమ్మాల మండలంలోని నల్లవల్లి గ్రామంలో డంప్ యాడ్ నిర్మాణం చేపడం జరుగుతున్న విషయమై గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రెడ్డి అక్కడికి చేరుకున్నారు విషయం తెలిసిన వెంటనే గ్రామంలో 144 సెక్షన్ అమలవుతున్నందున సునీత రెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులకు మధ్య పోలీసులతో వాగ్వివాదానికి దిగినారు. దీంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొన్నది.