డాక్టర్ కోటగల్ల శివరామకృష్ణను స‌న్మానించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

హత్నూర, జనవరి 16 ( సిరి న్యూస్ ) :

డాక్టర్ కోటగల్ల శివరామకృష్ణనునర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగల్ల శివరామకృష్ణ కు ముషీరాబాద్ లోని సిటీ కల్చరల్ ఆడిటోరియం లో ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీవారు డాక్టరేట్ ప్రధానం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాట్లాడుతూ శివరామకృష్ణ అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు మరియు ఉద్యమ పోరాట ఫలితమే ఈ యొక్క డాక్టరేట్ అవార్డు అని ప్రశంసించారు.

శివరామకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి నాకు డాక్టర్ దక్కినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను… శివరామకృష్ణ మాట్లాడుతూ నన్ను సన్మానించిన నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను…ఈ కార్యక్రమంలో హత్నూర ఎంపీపీ వావిల్ల నర్సింలు, అంబటి అర్జున్ , ముక్కిడి రాములు, ఎంపీటీసీ అగమయ్య సర్పంచ్ లక్ష్మీనారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.