గణేష్ గడ్డ సిద్ధి వినాయకున్ని దర్శించుకున్న జిఎంఆర్..
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలని ఆకాంక్ష..
పటాన్‌చెరు : న్యూస్ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభిలషించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పటాచెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, రుద్రారం పిఎసిఎస్ చైర్మన్ పాండు, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నరసింహా రెడ్డి, వెంకన్న, ఆలయ ఈవో లావణ్య, తదితరులు పాల్గొన్నారు.