పెండింగ్ బిల్లులను అందజేసిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ జనవరి 18 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ నియోజకవర్గం లోని విజయ డైరీ పాలసేకరణ కేంద్రం సభ్యులు గత కొన్ని నెలలుగా వారికి పెండింగ్ బిల్లులను రాకపోవడంతో ఈ విషయాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి దృష్టికి విజయ డైరీ కేంద్రం సభ్యులు తీసుకువెళ్లడంతో వారు ఈ విషయాన్ని విజయ డైరీ చైర్మన్ అనిత రెడ్డి, ఎండి, దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ బిల్లులను ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు భోజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జీవన్ సెట్ తదితరులు పాల్గొన్నారు