జిన్నారం : జిన్నారం మండల కాజిపల్లి గ్రామంలో కెమ్ టెక్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు సహకారం అందించడం పట్ల అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ గద్దె నరసింహ, మాజీ ఎంపిటిసి భార్గవ్, పరిశ్రమ ఎండి గుల్లపల్లి గోపికృష్ణ, సంస్థ హెచ్ఆర్ శ్రీనివాస్, గ్రామ నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.