సంగారెడ్డి, మే 17 (సిరి న్యూస్): వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వేంకటాచల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేసారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, చింతా గోపాల్, కోడూరు ఆంజనేయులు, నాగేష్ ,నరేష్, అవని, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.