సంగారెడ్డి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, జనవరి 4(సిరిన్యూస్ ): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి(Sangareddy District Collector Vallur Kranti)ని స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (MLA Chinta Prabhakar) శనివారం మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కలెక్టర్‌తో చర్చించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయాలని కలెక్టర్ ను కోరారు. గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు.