మాజీ సీఎం కెసిఆర్ గారిని కలసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

MLA Chinta Prabhakar meet former CM KCR
MLA Chinta Prabhakar meet former CM KCR

సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ ను సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి నీతృత్వంలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లి కలిశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పార్టీ కోసం అందరు కృషి చేయాలని మాజీ సీఎం కెసిఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజలకు చేరవేయాలి , రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదు నేను కొడితే మాములుగా ఉండదు..గట్టిగ కొట్టడం నా అలవాటు…మాములుగా కాదు గట్టిగా కొడుతా…అని కెసిఆర్ వ్యాఖ్యనించారు.

కెసిఆర్ ని కలసిన వారిలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, టీఎన్జీవోస్ ,మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లత విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు నక్క మంజులత నాగరాజ్ గౌడ్, రామప్ప, లావణ్య ప్రభూ గౌడ్, విష్ణువర్ధన్, పవన్, శ్రవంతి విఠల్, శ్రీకాంత్, లక్ష్మణ్, అశ్విన్, విఠల్, నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.