సదాశివపేట: జీనియస్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు IIT -JEE/NEET/OLYMPIAD-JANUARY-25 పాఠశాల స్థాయి పరీక్ష ఫలితాలలో తరగతి వారీగా ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన ర్యాంకర్స్ కు స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేసి విద్యార్థులను అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ IIT -JEE/NEET/OLYMPIAD పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా పాఠశాలలో అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రణిత, వైస్ ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ నాయకులు సత్యనారాయణ గౌడ్, బిఆర్ఎస్19వ వార్డు ఇంచార్జ్ బరాడి శివ తదితరులు పాల్గొన్నారు.