పటాన్ చెరువు , జనవరి 30 , సిరి : తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ఆవిష్కరించారు. హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డీలర్లకు తగు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు,. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.