సంగారెడ్డి : మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతిక కాయానికి ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళులు అర్పించారు. జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు.జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు.లోక్‌సభ సభ్యునిగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఓ సీనియర్ నాయకున్ని రాష్ట్రం కోల్పోయిందన్నారు.