మెదక్ : పాపన్నపేట మండలం ప్రాథమిక పాఠశాల గాజులగూడెంను ఎంఈఓ ప్రతాపరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న వినూత్న కార్యక్రమాలు చెట్టుకోచార్ట్ ను, ఎఫ్ ఎల్. ఎన్. అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రెండవ తరగతి విద్యార్థి పాడిన మౌనంగానే ఎదగమని పాటకు మంత్రముగ్ధుడయ్యాడు.
పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుల బృందం ఏర్పాటుచేసిన స్థలంలో కిచెన్ గార్డెన్ ను ప్రారంభించారు. అన్ని రంగాలలో దూసుకెళ్తున్న గాజులగూడం పాఠశాల ఉపాధ్యాయులను ఎంఈఓ ప్రతాప్ రెడ్డి అభినందించారు. ఎంఈఓ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిసిరి ; రవీందర్ రెడ్డి; వేణుగోపాల్ సి ఆర్ పి రాజశేఖర్ అనిల్ పాల్గొన్నారు.