గుమ్మడిదలలో మార్కండేయ జయంతి వేడుకలు

సిరి న్యూస్, గుమ్మడిదల : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహర్షి మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మహర్షి మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మహర్షి మార్కండేయ ముని జీవితం, వారి తపస్సు, ప్రజలకు అందించిన ఆధ్యాత్మిక సందేశాలు గురించి ప్రస్తావించారు. సమాజంలో సానుకూల మార్పులకు సంస్కృతిని, ధార్మికతను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల యాదగిరి, డాక్టర్ ఆనంద్, కత్తుల రమేష్, చిలుక శ్రీనివాస్, కంది రాము, మేకల రవీందర్, నాగభూషణం, సత్యం, సత్యనారాయణ, పద్మ, జ్యోతి ,లక్ష్మి సభ్యులు, పద్మశాలి పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.