చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చిన్నశివునూరు, పెద్ద శివనూర్ ప్రభుత్వ పాఠశాలలో నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు, నాణ్యమైన, వంట నూనెలు పప్పులు, వాడాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా ఒకరు రుచి చూసి విద్యార్థులకు వడ్డించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో,ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు,దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సాముద్దీన్,జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రభాకర్, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు బోళ్ల ప్రశాంత్, నరేష్ బోయిన శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.