మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలి

మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలి

రామాయంపేట జనవరి 17 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఈనెల 25వ తేదిన రామాయంపేట పట్టణంలో జరిగే సభకు విచ్చేస్తున్నారని హెచ్ పిఎస్ఎ జిల్లా అధ్యక్షుడు పాండు, మెదక్ జిల్లా దివ్యాంగుల కుటుంబ సంఘం అధ్యక్షుడు కుమ్మరి కుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మద్ధతు తెలుపుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదిగ ఉపకులాల నాయకులు, దివ్యాంగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాండు,జిల్లా దివ్యాంగుల కుటుంబ సంఘం అధ్యక్షుడు కుమ్మరి కుమార్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు రమేష్, గౌరవ అధ్యక్షులు గంగాపురం సంజీవ్, పాతూరు శ్రీనివాస్,తొంటావాలి ఎల్లం  పాల్గొన్నారు