ఫిబ్రవరి 2. సదాశివపేట (సిరి న్యూస్) : సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ మరియు శిఖర ధ్వజస్థంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మనభీన్ ఫౌండేషన్ చైర్మన్ ఎం ఏ ముఖిమ్, మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, మాజీ కౌన్సిలర్ ఇలియాజ్ షరీఫ్, సిందోల్ వినోద్ కుమార్ మన భీన్ ఫౌండేషన్ సదాశివపేట అధ్యక్షులు పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మన భీన్ ఫౌండేషన్ చైర్మన్ ముఖిమ్ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మన భీన్ ఫౌండేషన్ సభ్యులు మునిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.