ఫంక్షన్ హాల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

హత్నూర, జూన్ 6 (సిరి న్యూస్): ఫంక్షన్ హాల్ లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండల పరిధిలో దౌల్తాబాద్ గ్రామ శివారులో ఉన్న బి ఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం హత్నూర గ్రామానికి చెందిన మహంకాళి సురేష్ తండ్రి అశోక్ 28 అనే వ్యక్తి భోజనం చేస్తూ క్రిందపడి మృతి చెందాడనీ స్థానికులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు నితీష్, రాము కలరు. ఫంక్షన్ హాల్ లో పరిశీలించగా సీసీ కెమెరాలు లేకపోవడం తో మృతి చెందిన వివరాలు తేలియడం లేదు. కుటుంబీకులకు సమాచారం అందగా సంఘటన స్థలానికి చేరుకొని మృతుని వద్ద రోదిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలియజేశారు.