హత్నూర: మాల ఉద్యోగుల సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న కోరారు. హత్నూర మండలం దౌల్తాబాద్ లో మాలల జిల్లా సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మాలల ఐక్యత, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మాల ఉద్యోగుల సంఘం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రమైన సంగారెడ్డి అంబేద్కర్ జిల్లా సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తల్లి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోజిల్లా గౌరవ అధ్యక్షులు మేకల విజయరావు, అనంతరం,శ్రీనివాస్, మోహన్ రాజ్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.