ఘ‌నంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు

Mainanampally Hanmantha Rao's birthday celebrations were grand
Mainanampally Hanmantha Rao's birthday celebrations were grand

క్యాంప్ కార్యాలయంలో కేక్ కేట్ చేసిన మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్..
మెదక్ పట్టణ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ..

మెదక్ : కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు, మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి హన్మంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ మాట్లాడుతూ రాష్ర్టంలో గుర్తింపు కల్గిన నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అని అన్నారు.అనంతరం చర్చిలో హన్మంతరావు పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పట్టణంలోని కోదండ రామాలయ దేవాలయంలో మైనంపల్లి హన్మంతరావు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ పిట్లంబేస్ లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మెదక్ పట్టణ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాయర లింగం, అవారి శేఖర్, దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్, కొర్వి రాములు, షమి, ప్రవీణ్ గౌడ్, రాగి అశోక్, నిఖిల్, దుర్గప్రసాద్, మేడి మధుసూదన్, వసంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మంగ రమేశ్ గౌడ్, గోదల జ్యోతి క్రిష్ణ, బెస్త పవన్, స్వరూప, హరిత, భూపతి యాదవ్, మందుగుల గంగాధర్, చంద్రబోస్, అహ్మద్, ఉమర్, శివరామక్రిష్ణ, మహ్మద్ సూఫి, డిజె రితీష్, లల్లూ, గూడూరి శంకర్, లింగోజి, శేఖర్, పోచేందర్, గాడి రమేశ్, మైసన్, సాదిక్, అమీర్, మహ్మద్ అన్వర్, ఫసి, ముజాంబిల్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.