గౌరవ పురస్కార్ జ్ఞాపికను అందజేత..
ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందన్న వేణుగోపాలకృష్ణ..
సంగారెడ్డి : మైసూర్ మహారాజ్ హెచ్.ఈ. యాదువీర్ కృష్ణ దత్తు చమరాజా వడ్డీఆర్, మైసూర్లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి జాతీయ యువజన వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి కి చెందిన ప్రముఖ వక్త, సామాజిక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డా.కూన వేణుగోపాలకృష్ణకు ఆహ్వానం అందగా డా.కూన వేణుగోపాలకృష్ణ మైసూర్ కి వెళ్లడం జరిగింది.మైసూర్ లో నిర్వహిస్తున్న భరత జాతి ముద్దుబిడ్డ స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్రఅధ్యక్షులుగా హాజరైనందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ద్వారా నాకు గర్వ కారణంగా ఉంది అన్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ద్వారా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని 2000 మంది యువతి యువకులను విద్యార్థిని విద్యార్థులను చైతన్యం చేసి స్వామి వివేకానంద ఆశయ సాధనకు ఆ మహనీయుని స్ఫూర్తిగా ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోని గొప్ప చరిత్ర సృష్టించిన మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో డా. కూన వేణుగోపాలకృష్ణ సేవలను గుర్తించి మైసూర్ మహారాజు నుండి ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్రం నుండి మైసూర్ మహారాజు ప్రత్యేక గౌరవాన్ని అందించి వేదికపై ప్రతిష్టాత్మకమైనటువంటి స్వామి వివేకానంద పట్టిమ పురస్కార జ్ఞాపికను నాకు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు ఎంతో సంతోషంగా ఉందని డా. కూన వేణుగోపాల కృష్ణ పత్రికా సమావేశంలో తెలిపారు.